బ్లాగ్ రాసి చాలా రోజులైంది. So ఏదో ఒకటి రాయాలని మొదలుపెట్టాను. చదువుతూ వెళ్లండి. లాజిక్కులు అడక్కండి.
తాగుబోతు-- తను తూలుతూ ప్రపంచమే తలకిందలుగా ఉందని వీరంగం సృష్ఠించే తిక్క సన్నాసి.... తాగుబోతు గురించి వచ్చింది కాబట్టి మందు పార్టీ గురించి మాట్లాడుకుందాం..
బేసిక్‌గా పార్టీ చేసుకోవటానికి ఒక కారణం అంటూ ఉండదు.మన సౌలభ్యాన్ని మరియూ పార్టీ ఇచ్చేవాడి అమాయకత్వాన్ని బట్టి ఎన్ని కారణాలైనా సృష్ఠించుకోవచ్చు. సంవత్సరానికి అయిదు రూపాయిల నలభైఅయిదు పైసలు హైక్ రావటం దగ్గర్నించి ... పక్కింటి కుక్కపిల్ల నరేష్‌గాడితో లేచిపోయేవరకు ..కాదేది పార్టీకి అనర్హం(ఇక్కడ కుక్కపిల్లకు వేరే అర్థాలు ఏమీలేవు.కుక్కపిల్ల అనే చదవండి).ఇక venue..ఎవడో ఒక బ్యాచిలర్ బక్రాగాడి రూం ఉంటుంది.
ఒక గ్యాంగ్ మందు పార్టీలో కూర్చుంది అంటే అందులో పలు రకాల జీవులుంటాయి. ఉదాహరణకు:
సూపర్ సీనియర్ తాగుబోతులు : వీళ్లు మందుని మంచినీళ్లలా తాగేస్తారు.ఒకవేళ మందులోకి మనం నీళ్లు కలపాలని ట్రై చేసినా సున్నితంగా తిరస్కరిస్తుంటారు.వీళ్లకు ఎంత తాగాలో తెలుసు.కాని అంతకంటే ఎక్కువే తాగుతుంటారు.
సీనియర్ తాగుబోతులు : వీళ్లు అందరికి పెగ్గు కలుపుతూ మిగతా వారికి తెలీకుండా మధ్యలో raw తాగేస్తుంటారు. వీళ్లకు కూడా ఎంత తాగాలో తెలుసు and అంతే తాగుతుంటారు. Next
ఫ్రెషర్ తాగుబోతులు : వీళ్లు మూత మందులోకి అర లీటర్ థమ్స్అప్ కలుపుకొని, పక్కవాడి మొహం మీద నాలుగు చుక్కలు తీర్థంలా చల్లి..ఒక్క సిప్ తాగి "బాగా స్ట్రాంగ్‌గా ఉంది రా".."అబ్బా!! ఎక్కేసింది రా" లాంటి రెండు మూడు డైలాగ్స్ తడబడుతూ చెప్తుంటారు..వీళ్లకు ఎంత తాగాలో తెలియదు. కాకపోతే కాసేపయ్యాక కరుణానిధి కళ్లద్దాలు తీసేసినట్టు, జయలలిత రింగ రింగ పాటకు డ్యాన్స్ చేసినట్టు, కన్నడ సినిమా హీరో అందంగా ఉన్నట్టు..మొగలిరేకులు సీరియల్ అయిపోయినట్టు ..ఇలా ప్రకృతి విరుద్ధమైన అలోచనలు మనసులోకి రాగానే వాళ్లకు అర్థం అవుతుంది ఇక తాగటం ఆపాలని.
ఇక నాలుగో రకం.. వీరు మందు తాగకుండా తాగుబోతు ఎదవలు చేసే ఆగడాలను..ఆక్రుత్యాలను..అరాచకాలను చూసి ఆనందిస్తూ..అడగకపోయినా ఐస్ అందిస్తూ..వీలైతే వీడియో తీస్తూ ఉంటారు.ఇక పార్టీలో ఎలాగూ పాలు(బీరు)పంచుకోవాలి కాబట్టి, వీళ్లు గ్లాసులో కూల్‌డ్రింక్ పోసుకొని నీళ్లు కూడా కలుపుకోకుండా తాగేస్తుంటారు. వీళ్లతో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే "నా పక్క క్యూబికల్ అమ్మాయి కత్తిలా ఉందిరా" అని తాగిన మత్తులో మీరన్న మాటలను రికార్డ్ చేసి, మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇక అసలు పార్టీలోకి వెళ్తే.. మొదటి రౌండ్ చాలా ప్రశాంతంగా సాగిపోతుంది..రెండో రౌండ్లో .. హైక్ రాని ఓ తాగుబోతు మేనేజర్‌ని అమ్మనా బూతులూ తిట్టటంతో అసలు రచ్చ మొదలౌతుంది...మేనేజర్ ఎవడికైనా మేనేజరే కాబట్టి మిగతా వాళ్లు కూడా రెండు మూడు బూతులు సాయం అందిస్తారు.ఆ తర్వాత ఎవడి మేనేజర్ అందరికంటే పెద్ద ఎదవ అని కాసేపు తీవ్రమైన వాగ్వివాదం చేసుకుంటూ, మిరపకాయ బజ్జీలు, చిప్సు ఒకరి మీద ఒకరు విసురుకుని నిరసన తెలుపుతారు. చివరకు ఒక సూపర్ సీనియర్ తాగుబోతు కలగజేసుకుని, ఎవరో ఒక మేనేజర్ కించపరచటం మంచిది కాదు అని భావించి, అందరి మేనేజర్లకు సమానమైన మార్కులు వేస్తాడు.దీంతో బాటిల్ మూతలను గాల్లోకి ఎగరేసి హర్షం వ్యక్తం చేస్తూ అందరూ మళ్లీ పార్టీలోకి దిగుతారు.
ఇలా ఆఫీస్ రాజకీయాలను కాసేపు కూలంకషంగా చర్చించాక డిస్కషన్ రకరకాల మలుపులు తిరుగుతుంది.... సానియ మీర్జా షోయబ్ మాలిక్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది.. recentగా విడుదలైన "స్మశానంలో సరిగమపదని" అనే సినిమా ఎన్ని సెంటర్స్‌లో వంద రోజులు ఆడుతుంది... తమిళ్ హీరో విజయ్‌కాంత్ మనిషా కాదా...మొదలగు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికి ట్రై చేస్తారు.(పాఠకులకు quiz:ఆ చివరి ప్రశ్నకు క్రింది ఫోటో చూసి సమాధానం చెప్పటానికి ట్రై చెయ్యండి).
ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు బిజీ హీరో తారకరత్న , మాజీ హోం మంత్రి జానా రెడ్డిలాంటి మేధావులు మాత్రమే సమాధానాలను ఇవ్వగలరు అని డిసైడ్ అయ్యి next పెగ్గు వేసుకుంటారు.
ఇలా డిస్కషన్ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు ఒక కామన్ పాయింట్ దగ్గర ఆగిపోతుంది.... ప్రేమ. ఖచ్చితంగా గ్యాంగ్‌లో ఒక భగ్నప్రేమికుడు, ఓ కన్వర్టెడ్ ప్రేమికుడు (అదేనండీ , పెళ్లయ్యాక భార్యని ప్రేమిస్తుంటాడుగా ..ఆ టైప్) మరియు ఓ ఫ్రెషర్ ప్రేమికుడు ఉంటాడు. ఇక చూస్కో నాసామిరంగా , వినేవాడు KCR అయితే బాలక్రిష్ణ bungee jump చేశాడు అని చెప్పాడంట వెనకటికి ఎవడో. ఆ లెక్కన, వీళ్లందరు మన ఫ్రెషర్ ప్రేమికుడి చుట్టూ కూర్చుని కృష్ణుడు భగవద్గీత బోధించినట్టు 5.1 సరౌండ్ సిస్టంలో జ్ఞానోదయం చేస్తుంటారు(నరేష్‌గాడు నములుతున్న కుర్‌కురె సౌండుని ఈ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు).వాడికి జ్ఞానోదయం అవుతుందో లేదో తెలియదుగానీ వీళ్ల భాగవతం అయ్యేసరికి మందు మాత్రం ఖాళీ అయిపోతుంది.ఏది ఏమైనా ఆ సలహాలన్ని వింటే జీవితం సంకనాకిపోతుందని చెప్పేవాడికీ తెలుసు, వినేవాడికి కూడా తెలుసు.
ఇలా ఆఖరి పెగ్గు అయ్యేసరికి conversation ఈ క్రింది విధంగా ఉంటుంది (ఇక్కడ సరదాగా కొన్ని పేర్లు వాడుతున్నాను.వీళ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు.వీళ్లు నా ఫ్రెండ్స్ అని మీరు అస్సలు అనుకోకూడదు) :
ప్రతాప్: "ఏరా ఏం తిందాం?"
రవి: “అవును నిజమేరా.. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిండకూడదు”
మహేష్: "వీళ్లిద్దరికీ బాగా ఎక్కిందిరా" అని వికటాట్టహాసం చేస్తూ చికెన్ ముక్క అనుకొని నాలుగోవాడి వేలు కొరుకుతుంటాడు.
నాలుగోవాడు నరేష్‌గాడని నేను చెప్పాలనుకోవట్లేదు.ఒకవేళ చెప్పిన మీరు నమ్మకూడదు. సరేనా ?
ఈ తతంగమంతా అయిపోయాకా,ప్రొద్దున లేచి చూస్తే ఎవడు బాత్‌రూంలో పడుకున్నాడు..ఎవడు బెడ్‌రూంలో ఉన్నాడు..ఎవడు సోఫా కిందనుంచి వస్తున్నాడు అన్న విషయం మాత్రమే గమనించాల్సి ఉంటుంది.
తాగండి... కాకపోతే ప్రొద్దున్నే లేచి బ్రష్ చేసుకునేప్పుడు బ్రష్ మీద షేవింగ్ క్రీం కాకుండా టూత్‌పేస్ట్ మాత్రమే వేసుకోగలను అన్న నమ్మకం ఉంటేనే తాగండి And పొరపాటున కూడా తాగి డ్రైవ్ చెయ్యకండి. మీ ప్రాణాలు మీ ఇష్టం. కానీ మీతో ముడిపడిన జీవితాలు కొన్ని ఉంటాయని మర్చిపోకండి.
vijaykanth episode chaala baavundi... motham tapa .. chaala saradaaga vundi....
ReplyDeleteBacardi - Drink responsibly.
Nice post B. Next time nanu kuda add chesko party lo ke..
మా ఫ్రెండ్స్ ఇలా బాగా తాగి తలకెక్కిన తరువాత "ఎక్కడ పడుకుందాంరా?" అన్న ప్రశ్నకు "చెన్నై" లో అని సమాధనం రావడంతో ఆచరించిపారేశారు. అంత రాత్రి కారు బుక్ చేసుకొనిమరీ. :)
ReplyDeleteBagundayya Bharath..kani mandhu chala tondaraga taagesinatlu undhi...inka koncham rasavattaranga...podugga..unte bagunnindu...mathu ekkabothandhi ane samayamlo evado puli cinema hit ante mathu digipoyinatlu..ee tapa akasmaattugaa ayipoyindhi..
ReplyDeleteabimanulanu nuvvu inka baga santrupthiparachali..
prani's rating : 3.75/5
Bagundayya Bharath..kani mandhu chala tondaraga taagesinatlu undhi...inka koncham rasavattaranga...podugga..unte bagunnindu...mathu ekkabothandhi ane samayamlo evado puli cinema hit ante mathu digipoyinatlu..ee tapa akasmaattugaa ayipoyindhi..
ReplyDeleteabimanulanu nuvvu inka baga santrupthiparachali..
prani's rating : 3.75/5
alaage babai.. iena Prani's rating 3.75 antey mari post hittey :P
ReplyDeleteసూపర్!
ReplyDelete@ Indian Minerva: kompadeesi hyderabad ninchi vellaledu kadaa :P
ReplyDeleteKeka Post Bharath....
ReplyDeleteThanks Naresh :-)
ReplyDeletehey bharath superb ga vundhi,...i njoyed reading ...""vinevaaadu KCR ayithe....."" dialogue bagundhi..
ReplyDeleteadhi sare neeku mogalirekulu serial topic yenduku asalu naaku teliyaka adugutha..dont touch tat OKKK...just kidding
overall ga words usage n writting skills baga improve ayyayi...waiting for ur next blog :-)
@naresh:very Apt satire... :-)
ReplyDeleteThnx Divya... don't worry.. maa puli malli panja visurutaadu :-)
ReplyDeleteNice Blog Bharath..
ReplyDeleteJust at the same time when the most famous October Fest is Happenning here in Munich celebrating 200 years..
Evadu entha thaaguthunnado enduku thaaguthunnado assalu theliyadhu..Endukante Akkadiki vachhede Thaagadaniki..
Australia nunchi Alaska Varaku Anni countries nunchi Vastharu...
BTW Swiss philosophy..SAVE MILK, DRINK BEER
Drink less,Stay safe..Have Fun.
Bharath!
ReplyDeleteతెలుగు లో వ్రాయడం ఎంత కష్టమో నాకు తెలుసు......మన పార్టీలలో ముఖ్యమైనది మన గ్రూప్ డైలాగ్స్.... ఇవి ఇంకా ఉండి ఉంటే చాలా బాగుండేది...మంచి టాపిక్ ఎంచుకున్నందుకు నా క్రుతజ్ఞతలు!
Super bavaa.... calm gaa undee neeloo intha kala undani expect cheyyaledu...nee wordings simply superb...inkoncham extend chesuntee inka super....mukyangaa tagubothu rakaalu baga explain chesaavu.....v njoyed it....keep it up!!! :-)
ReplyDeleteMee ee tapa chadivaaka, navvadam aapaleka mee first tapa varakoo annee chadivesa... :)
ReplyDeleteInka chadavalani unna kani emi migalaledu... Chaala saradaga unnayi... Next tapa kosam wait chesthunnam...
@ shilpa: thnx maradalu gaaru... edo mee aashirvaadam tho naaku thochindi raastunna
ReplyDelete@ Swetha: wow!!.. someonez new to my blog.. thnx for the comments :-)
@ Swetha: meeru follow ayye thotaramudu naa inspiration :)
ReplyDeleteem ya blogubothu...eppudu vasthundhi mee tharuvathi tapa...
ReplyDeleterasuko...nee istam ..nee tapa ki nuvve wyaakhya lu rasuko..tondarlo vandha poorthi cheyali sumaa..
ReplyDelete